పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలు చిరస్మరణీయం

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా 

పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలు చిరస్మరణీయం

IMG-20241021-WA0032వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:

శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయం నిలిచిపోతారని  వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములోఅమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే)ను సోమవారం ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధినిర్వహణలో మరణించిన 241 మంది పోలీస్ అమరవీరుల పేర్లను అదనపు డీసీపీ రవి చదివి వినిపించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గోన్న వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డా.సత్య శారద, ప్రావీణ్య, కర్నల్ రవికుమార్ రవి, డిసిపిలు షేక్, సలీమా, రవీందర్ తో పాటు అదనపు ఏ.సి.పిలు, ఏ.సి.పిలు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్.ఐలు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాగుచ్చాలు వుంచి నివాళులు అర్పించిన పిదప, ఆర్.ఐ స్పర్జన్ సారధ్యంలో సాయుధ పోలీసులు శోక్ శ్రస్త్ చేసి మరణించిన పోలీసు అమరవీరులకు పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సేవకోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసులు మహనుభావులని, పోలీసు అమరవీరుల చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కొరకు పాటుపడాలని, ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ధి, నితీ, నీజాయితీతో పనిచేయాల్సి వుంటుందని పోలీసు అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారు ఎల్లప్పుడు మన గుండెల్లోనే వుంటారని, వారు మన మధ్య లేనకున్నా మనం వారిని స్మరిస్తునే వుంటామని, అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవల్సిన భాధ్యత మనందరిపై వుందని, వారికి ఎలాంటి సమస్య వున్న వారికి పోలీస్ విభాగం తరుపున పూర్తి సహకారం అందజేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయము నుండి మిషన్ హస్పటల్ వరకు నిర్వహించిన ర్యాలీలో పోలీసులు అధికారులు, సిబ్బంది పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో పాటు పోలీసు జాగృతి కళాబృందం సభ్యులు పాల్గొని పోలీసు అమరవీరులకు జోహర్లు అర్పించారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .