పంచాయితి ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
Views: 88
On
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. ఇందు కోసం తాజాగా పంచాయతీల ఓటర్ల తుదిజాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలోని 12,867 గ్రామ పంచాయతీల్లో 1,13,722 వార్డులు ఉండగా వాటిల్లో 1,67,33,584 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. పంచాయతీ ఓటర్లలో 82,04,518 మంది పురుషులు ఉండగా మహిళా ఓటర్లు 85,28,573 మంది, ఇతరులు 493 మంది ఓటర్లు ఉన్నట్లు స్పష్టం చేసింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 10,42,545 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 64,397 మంది ఓటర్లు ఉన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments