రామాలయ ఆవరణలో మద్యం సేవిస్తూ దోరికిన యువత

మా నాన్న ఎవరో తెలుసా అంటూ కాలనిలో మందుబాబుల వీరంగం 

రామాలయ ఆవరణలో మద్యం సేవిస్తూ దోరికిన యువత

వేలేరు:

మండలంలోని మలికుదుర్ల గ్రామంలో గల రామాలయం ఆవరణలో కొందరు యువకులు సభ్యత సంస్కారం లేకుండా ఆలయ ఆవరణలోనే మందు సేవిస్తున్నారు. ఇది పద్ధతి కాదని ప్రశ్నించే వారిపై మందుబాబులు చేయి చేసుకుంటూ గొడవకు దిగుతున్నారు. రోజు రోజుకి మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్టు లేకుండా పోతుంది. మద్యం సేవిస్తూ దారిన పోయే వారితో కావల్చుకొని గొడవకు దిగుతున్నారు. ఏమీ చేయలేని పరిస్థితిలో కాలనీవాసులు కృంగిపోతున్నారు, మద్యం మత్తే కాకుండా గంజాయి, డ్రగ్స్ కోరల్లో మల్లికుదుర్ల గ్రామ యువత నిర్బంధమైపోతూందనిపలువురుఅభిప్రాయపడుతున్నారు.తాజాగా శనివారం సాయంత్రం దర్జాగా మందుబాబులు ఆలయ ఆవరణలో మద్యం సేవిస్తూ కనబడటంతో అప్రమత్తమైన స్థానికులు ఇది సభ్యత కాదని ప్రశ్నించడంతో ప్రశ్నించిన వారిపై దౌర్జన్యానికి దిగుతూ గుండాయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. విద్యుత్ దీపాలు లేని కారణంగా చీకటి పడటంతో అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఆ గదులను వాడుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి, ఇది చూడలేని స్థానికుల గోడు మిన్ను అంటుతున్నది. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి మద్యం, డ్రగ్స్ వంటి వాటి నుండి యువతను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .