ఎమ్మెల్సీ కవితకు తక్షణమే తీన్మార్ మల్లన్న క్షమాపణలు చెప్పాలి
బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కుర్సపల్లి రమేష్
ధర్మసాగర్, తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ధర్మసాగర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు కుర్సపల్లి రమేష్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ తీన్మార్ మల్లన్న తక్షణమే కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
“కంచం పొత్తు… మంచం పొత్తు” వంటి పదాలు తెలంగాణ మహిళల గౌరవాన్ని దిగజార్చేలా ఉన్నాయని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. “మహిళల గౌరవాన్ని కాపాడడం మన సంస్కృతి. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలకు, మహిళలను కించపరిచే వ్యాఖ్యలకు స్థానం లేదు. ప్రత్యేకించి ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు మర్యాదతో వ్యవహరించాలి” అని స్పష్టం చేశారు.
అలాగే ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ కోసం పోరాడినప్పుడు తీన్మార్ మల్లన్న ఎక్కడ ఉన్నాడో తెలియదని అన్నారు. “ఇప్పుడు వ్యక్తిగత దూషణల ద్వారా ప్రజాద్రోహ రాజకీయాలు చేయడం తగదు. ఇప్పటికైనా బాధ్యతతో వ్యవహరించి ఎమ్మెల్సీ కవితని బేషరతుగా క్షమాపణ కోరాలి” అని రమేష్ తెలిపారు.“విభేదాలు ఉండొచ్చు, కానీ మహిళల పట్ల గౌరవం తప్పనిసరి. మల్లన్ననూ నేను ఒక నాయకుడిగా అభిమానించేవాడిని. కానీ ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు సమాజానికి తగవు. మాటలపై నియంత్రణ అవసరం” అని ఆయన పేర్కొన్నారు.


Comments