సామాజిక బాధ్యతగా నిరుద్యోగులకు శిక్షణ

సామాజిక బాధ్యతగా నిరుద్యోగులకు శిక్షణ

తెలంగాణ ముచ్చట్లు, మందమర్రి:-

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచనల మేరకు సింగరేణి యాజమాన్యం స్థానికంగా ఉండే నిరుద్యోగ యువతకు లబ్ధి చేకూర్చు దిశగా, సామాజిక బాధ్యతగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తుందని ఏరియా జిఎం జి దేవేందర్ తెలిపారు. సోమవారం పట్టణంలోని స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రంలో సింగరేణి ఏరియా సిఎస్ఆర్, రీజనల్ డైరెక్టరేట్ అఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ (ఆర్డిఎస్డిఇ), హైదరాబాద్ ఆద్వర్యంలోకంప్యూటర్,డిటిపికోర్సునుఆయనప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంప్యూటర్, డిటిపి కోర్సును ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం రాజేశ్వర్ రెడ్డి, ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, ఈ అండ్ ఎం డిజిఎం వై వెంకటరమణ, జిఎంవిటిసి మేనేజర్ శంకర్, జిఎంవిటిసి అసిస్టెంట్ ట్రైనింగ్ మేనేజర్ అశోక్, కంప్యూటర్ శిక్షకులు బెంజిమెన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .