పిడుగుపాటుకు ఆత్మకూరు లో ఇద్దరు మహిళలు,రేగొండ లో ఒకరు మృతి

పిడుగుపాటుకు ఆత్మకూరు లో ఇద్దరు మహిళలు,రేగొండ లో ఒకరు మృతి

 

 

వరంగల్,తెలంగాణ ముచ్చట్లు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం సాయంత్రం ఉరుములు మెరుపులు వచ్చి వర్షం పడింది. అయితే పిడుగులు పడడంతో హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలో ఇద్దరు మహిళ కూలీలు మృతి చెందారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రగయ్యపల్లిలో వ్యవసాయ కూలీ పిడుగుపాటుతో కుప్పకూలిపోయింది. చౌల్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు కూలీలు ఇటకాల నిర్మల, సోలంక రమ వ్యవసాయ పనులకు వెళ్లి వస్తుండగా.. కల్లు మండువ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిర్మల, రమ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రంగయ్యపల్లికి చెందిన లక్ష్మి భర్తతో కలిసి వ్యవసాయ భూమిలో మిరప తోటకు పిండి చల్లుతుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు వచ్చి వర్షం రావడంతో పిడుగుపాటుకు గురైంది.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .