డీఎస్సీలో ఉద్యోగం సాధించిన వెల్టూర్ యువతి

ఉపాధ్యాయురాలు కావాలన్నా కళ నెరవేరింది

డీఎస్సీలో ఉద్యోగం సాధించిన వెల్టూర్ యువతి

 

తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహంతోనే ఉద్యోగం సాధించా ! 

- వెల్టూర్ యువతి గాయత్రి

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు: 

ఉపాధ్యాయురాలు కావాలని కలలుగన్నది. లక్ష్యం నిర్దేశించుకుని కష్టపడి చదివి, అనుకున్నది సాధించి, మిగతా వారికి స్ఫూర్తిగా నిలిచింది. సెప్టెంబర్ 30న విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన గాజులపేట బాలరాజు కుమార్తె గాయత్రి టీచర్(ఎస్జిటీ) ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా గాయత్రీ మాట్లాడుతూ... జీవితంలో ఉన్నతంగా ఎదగాలని లక్ష్యం ఉంటే ఏది అడ్డురాదని నిరుపేద కుటుంబానికి చెందిన గాయత్రి అన్నారు. మా తల్లిదండ్రులు బాలరాజు, మన్నెమ్మ మరియు భర్త రాజు ప్రోత్సాహం ఎంతో ఉందని, వారి సహకారంతో కష్టపడి చదువుకొని ఉద్యోగం సాధించానని, ఉద్యోగం రావడం పట్ల చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .