గాంధీజీ చూపిన బాటలో పయనించాలి

మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లు

గాంధీజీ చూపిన బాటలో పయనించాలి

 

 

తెలంగాణ ముచ్చట్లు, మందమర్రి:-

సత్యం, అహింసా మార్గాలను గాంధీజీ సూచిస్తూ, వాటి బాటలోనే పయనించి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని, గాంధీజీ చూపిన మార్గాలలో ప్రతి ఒక్కరూ పయనించాలని పట్టణ మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు పట్టణ మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ స్వతంత్రాలు అందించిన గొప్ప వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ అధికారి పి కృష్ణ ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ వి శ్యాంసుందర్, హెల్త్ అసిస్టెంట్ ఎంఏ సమీర్, జూనియర్ అసిస్టెంట్లు జహీర్, ఈ వసంత్, ఎన్ రాజ్ కుమార్, ఇన్చార్జ్ టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఏనుగు రఘురాం, పర్యావరణ ఇంజనీర్ ఎం గోపికృష్ణ, డాటా ప్రాసెసింగ్ అధికారి బొల్లు శ్యాంబాబు, సిస్టం మేనేజర్ ఏ శిరీష్, సిస్టమ్ అసిస్టెంట్ వి ప్రభాకర్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ వర్కర్ చిప్పకుర్తి రాజశేఖర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీజీ చిత్ర పటానికి పూలమాలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు, అనంతరం వారు మాట్లాడుతూ, గాంధీజీ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పైడిమల్ల నర్సింగ్, మహంత్ అర్జున్, పాషా, బత్తుల సరిత, అడేపు వేణు, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .