చేగువేరా స్ఫూర్తితో దోపిడీకి,అన్యాయాలకు వ్యతిరేకంగా యువత పోరాడాలి.
-చేగువేర స్ఫూర్తితో సామాజిక,సేవ కార్యక్రమాలు నిర్వహించాలి.
డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్ పిలుపు.
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
నేడు సమాజంలో జరుగుతున్న దోపిడీకి,అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడటమే చేగువేరా కి ఇచ్చే నిజమైన నివాళి అన్ని, చే ఆశయాల సాధనకు విద్యార్దులు, యువత కృషి చేసి పోరాడాలనీ చే స్ఫూర్తితో సామాజిక,సేవ కార్యక్రమాలు నిర్వహించాలనీ డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్ పిలుపునిచ్చారు.ప్రపంచ విప్లవకారుడు యూత్ ఐకాన్ చేగువేరా 58వ వర్ధంతి సందర్భంగా స్థానిక చిమ్మపుడి గ్రామంలో డి.వై.యఫ్.ఐ,యస్.యఫ్.ఐ ఆధ్వర్యంలో చేగువేరా చిత్ర పటానికి పూలమాల, పూలు వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది.ఈ సందర్బంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా అన్యాయం జరిగితే స్పందించడానికి సిద్ధంగా ఉండు అన్ని చేగువేరా ఇచ్చిన పిలుపుని అందుకొని చేస్ఫూర్తితోడి.వై.యఫ్.ఐ,యస్.యఫ్.ఐపనిచేస్తుందని,చేగువేరా క్యుభా లో విప్లవం తీసుకొచ్చి లాటిన్ అమెరికా దేశాల్లో మోటర్ సైకిల్ ర్యాలీ చేసి పేద ప్రజల కోసం దోపిడీకి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు అన్ని ఆయన తెలిపారు.నేడు సమాజంలో జరుగుతున్న దోపిడీకి,అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడటమే చేగువేరా కి ఇచ్చే నిజమైన నివాళి అన్ని, చే ఆశయాల సాధనకు విద్యార్దులు, యువత కృషి చేసి పోరాడాలనీ చే స్ఫూర్తితో సామాజిక,సేవ కార్యక్రమాలు నిర్వహించాలనీ డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డి.వై.యఫ్.ఐ,యస్.యఫ్.ఐ నాయకులు రేమల్లె.జైపాల్, షేక్.నఫీర్,జోనెబోయిన.నవీన్,లోహిత్ రెడ్డి, పురం. నవీన్ తదితరులు పాల్గొన్నారు.


Comments