నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు 

బజార్ హత్నూర్ ఎస్సై అప్పారావు

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు 

అదిలాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

న్యూ ఇయర్ వేడుకలు సందర్భంగా బజార్ హత్నూర్ ఎస్సై అప్పారావు మాట్లాడుతూ 31 డిసెంబర్ అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రజలు రహదారుల్లో తిరగకూడదని, పోలీసు పికెటింగ్, రాత్రి గస్తీలు, వాహనాల తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు.

వైద్య, పోలీసు సహకారంతో, ఆంక్షలు పాటిస్తూ న్యూ ఇయర్ వేడుకలు జరపాలని, ప్రజలు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలసి వేడుకలు జరపాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగ్, పార్టీలు, డీజేలు, లౌడ్‌స్పీకర్లు ఉపయోగించడం మరియు డ్యాన్సులు చేయడం నిషేధించబడ్డాయని తెలిపారు.

అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రజలు రహదారులపై గుమిగూడి ట్రాఫిక్‌ను ఇబ్బంది పెట్టరాదని, మహిళలు, యువతులను ఈవీజింగ్ చేయరాదని, మద్యం సేవించి లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని ఆయన స్పష్టం చేశారు.

ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసులు, త్రిబుల్ రైడింగ్‌పై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారని, ఇందులో భాగంగా వాహనాలు సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, బాణసంచా సామగ్రి కాల్చడం కూడా నిషేధించారు.
మద్యం దుకాణాలు ప్రభుత్వ నిర్ణీత సమయం మేరకే పనిచేస్తాయని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని బజార్ హత్నూర్ ఎస్సై అప్పారావు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .