బడి బయట విద్యార్థుల గుర్తింపుకు ప్రత్యేక సర్వే

-ఒక్క విద్యార్థి కూడా బడి బయట ఉండకూడదు

బడి బయట విద్యార్థుల గుర్తింపుకు ప్రత్యేక సర్వే

-6-14 సంవత్సరాల విద్యార్థులందరూ పాఠశాలలో ఉండాలని కలెక్టర్ దృష్టి

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

జిల్లాలో బడి బయట ఉన్న విద్యార్థులను గుర్తించేందుకు ఈ నెలలో ప్రత్యేక సర్వే నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సత్య శారదా దేవి ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో విద్యాశాఖ, కార్మిక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీసు శాఖలతో ప్రత్యేక సమీక్ష సమావేశం జరిగింది.

ఈ సర్వేలో విద్యార్థుల గైర్హాజరుకు గల కారణాలను తెలుసుకోవడం, వారిని తిరిగి బడికి చేరవేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. ఒక నెలకు పైగా పాఠశాలకు హాజరుకాని విద్యార్థులను గుర్తించి, వారిని బడి బయట విద్యార్థులుగా (ఓఎస్సీ) పరిగణించాలని ఆదేశించారు.

విద్య ఆపివేసిన వారి కోసం ఓపెన్ స్కూల్

15-19 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు చదువు ఆపివేసిన సందర్భాల్లో, వారికి ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా విద్య కొనసాగించే అవకాశం కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ఆకర్షించేలా పాఠశాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రత్యేక సర్వేలో భాగస్వాములు

ఇటుక బట్టీల వద్ద పని చేసే పిల్లలు, వలస కార్మికుల పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, యువజన సంఘాలు, గ్రామ సచివాలయ కార్యదర్శులు ఈ సర్వేలో భాగస్వాములుగా ఉండాలని సూచించారు.

సర్వే నిర్వహణకు అవసరమైన ప్రొఫార్మాలు, మార్గదర్శకాలను జిల్లా విద్యాశాఖ అధికారి సమావేశంలో వివరణ ఇచ్చారు. డిసెంబర్, జనవరి నెలల్లో జరిగే ఈ సర్వేకు ఉపాధ్యాయులు, క్లస్టర్ రిసోర్స్ పర్సనల్ తో పాటు ఇతర శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, గుణాత్మక విద్య సమన్వయ అధికారి శ్రీనివాస్, సంక్షేమ అధికారి జయంతి, పోలీసులు, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .