హక్కులు, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: ఏసీపీ జగన్

హక్కులు, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: ఏసీపీ జగన్

తార్నాక, అక్టోబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు)

ఇటీవల ఎన్నికైన నాచారం ఓయూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సభ్యులను ఉస్మానియా యూనివర్సిటీ డివిజన్ ఏసీపీ జగన్ అభినందించారు. మంగళవారం ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారులు రాజు నేతృత్వంలో, అధ్యక్షుడు గణేష్, కార్యదర్శి కిరణ్ సమక్షంలో క్లబ్ సభ్యులు ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించి, ఏసీపీ జగన్, ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు లను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఏసీపీ జగన్ క్లబ్ సభ్యులను శాలువాతో సత్కరించి మాట్లాడుతూ, “ఫోర్త్ ఎస్టేట్‌గా ఉన్న మీడియా ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి, వాటి పరిష్కారానికి ప్రభుత్వాన్ని దిశానిర్దేశం చేయాలి” అని అన్నారు. అలాగే ప్రజల్లో హక్కులు, చట్టాలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. “చట్టాలు తెలిసినప్పుడే ప్రజలు ప్రశ్నించగలుగుతారు, ప్రశ్నించినప్పుడే సమాజంలో న్యాయం స్థాపించవచ్చు” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో విశ్వం గౌడ్, రాజు, పనింద్ర చారి, జాఫర్, విజయ్, తిరుమలరెడ్డి, వెంకట్, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .