అంబేద్కర్ పై చేసినా వ్యాఖ్యలపై అమిత్ షా పదవికి రాజీనామా చేయాలి
దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కికి తీసుకోవాలి
-ఎంపీ మల్లు రవి, ఏమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
వనపర్తి ,తెలంగాణ ముచ్చట్లు:
దేశ ప్రజలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యంని కాపాడడం కోసం రక్షణ కవచం లాగా ఏర్పడి దేశాన్ని రక్షిచాలి అని పార్లమెంట్ ఎంపీ మల్లురవి అన్నారు. వనపర్తి లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మల్లురవి మాట్లాడుతూ పార్లమెంటులో సమావేశంలో పార్లమెంటు సభ్యుల ఎదురుగా రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను అవమానం చేసి మాట్లాడిన బిజెపి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.భారత ప్రజలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రక్షించాలి. భారత పౌరులకు హక్కులు, స్వచ్చలను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించారు. వాటిని హరించకుండా భారత దేశ పౌరులు గట్టిగా సమాధానం చెప్పాలని అని అన్నారు. రాజ్యాంగానికి పట్టాదారులు ప్రజలు.రాజకీయ నాయకులు కౌలు దారులు లాంటివారు కొద్దీ రాజులు ఉండిపోయేవారు మాత్రమే అన్ని అన్నారు.ప్రజాస్వామ్యం మీద దాడి చేసిన బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని అన్నారు. పార్లమెంటులో అంబేద్కర్ కు జరిగిన అవమానాన్ని దేశం లో ఉన్న ప్రజలందరూ గమనించారు అన్ని అన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఇండియా కూటమి నేతలు పార్లమెంటులో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశాం అన్నారు. ప్రధానమంత్రి మోడీ,అమిత్ షా రాజ్యాంగం,ప్రజాస్వామ్యం పై దాడి చేస్తున్నారు అన్ని అన్నారు.ప్రజల హక్కులను కాలరాస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వంని గద్దె దించే విధంగా భారత పౌరులు కృషి చేయాలి అన్నారు.
ఎమ్మెల్యే తుడి మేఘరెడ్డి మాట్లాడుతూ...
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన వ్యాకలను త్రీవంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే మేఘ రెడ్డి అన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్త కంఠంతో ఖండించారు అని అన్నారు ఈ సమావేశంలో డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మహేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్ ,నియోజవర్గ సమన్వయకర్త లకాకుల సతీష్ ,మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో పాల్గొన్నారు.


Comments