అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అక్రమ అరెస్టు ఘాటు ఖండన సిఐటీయు
మల్కాజ్గిరి, సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ (సిఐటీయు) కార్యదర్శి బి. శోభారాణి మల్కాజ్గిరి, మేడ్చల్, రామంతపూర్, కుత్బుల్లాపూర్, దిండిగల్ లోని అంగన్వాడీ కేంద్రాల టీచర్స్ మరియు హెల్పర్స్ ను చలో సెక్రటేరియట్ ఉద్యమంలో పాల్గొన్నందుకు అక్రమంగా అరెస్టు చేసిన పరిస్థితిని ఘాటుగా ఖండించారు.యూనియన్ అధికారులు ప్రకారం, అంగన్వాడీ ఉద్యోగులు ప్రీప్రైమరీ, పి.ఎం . శ్రీవిద్య వంటి విద్యా కార్యక్రమాలను నిర్వహించడానికి వారి విద్యా బాధ్యతను అందుకోవాలని, ఎఫ్ఆర్ఎస్ వ్యవస్థను రద్దు చేయాలని, ఒకే ఆన్లైన్ యాప్ ద్వారా సౌకర్యం కల్పించాలని, 5జి నెట్‌వర్క్ సౌకర్యంతో మొబైల్ ఫోన్లు ఇవ్వాలని పలు వినతిపత్రాల ద్వారా ప్రభుత్వానికి కోరినప్పటికీ, ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదు.
అందులో, ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం రూ. 18,000/- వేతనం, పిఎఫ్ అమలు, ఐసిడిఎస్ మంత్రికి హామీ ప్రకారం 24 రోజుల సమ్మె వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ జి.ఓ. 8 సవరణలు, పెంచిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, 3 నెలల పిఆర్సి, మినీ టీచర్స్ 11 నెలల ఏరియర్స్, రిటైర్మెంట్ అయినవారికి 10 నెలల సిబిఈ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకపోవడం వల్ల ఉద్యోగుల పని భారం పెరిగినట్లు యూనియన్ హెచ్చరించింది. ప్రభుత్వానికి వెంటనే సమస్యలను పరిష్కరించమని తగిన డిమాండ్ చేశారు.యూనియన్ కార్యదర్శి బి. శోభారాణి మాట్లాడుతూ, “ప్రజా పాలన అని చెప్పుకుంటున్నా, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యలను పట్టించుకోవడం లో ప్రభుత్వం విఫలమైంది. అక్రమ అరెస్టులు సహనించుకోలేము,” అని తెలిపారు.


Comments