బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుర్మార్గంగా ఉన్నాయి

మంత్రి సీతక్క ఆవేదన

బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుర్మార్గంగా ఉన్నాయి

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
 
“క్యాబినెట్లో అందరినీ అర్బన్ నక్సలైట్లు అని సంజయ్ ఆరోపించడం దురుద్దేశపూరితమైంది.నాలాంటి అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వారికి ఇది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర. నిజానికి క్యాబినెట్లో నక్సలైట్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి నేనొక్కడినే. మరి మొత్తం క్యాబినెట్‌ను నక్సలైట్ ముద్రతో ఆపాదించడం ఎందుకు?” అని సీతక్క ప్రశ్నించారు.
 
సీతక్క వ్యాఖ్యలు:
• “2004లో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీకి దిగినప్పుడు, బీజేపీనే నాకు మద్దతు ఇచ్చింది. అప్పుడే నా బ్యాక్‌గ్రౌండ్ వారికి తెలియదా? నేను ప్రజల మధ్య జీవించి, నల్లకోటు వేసుకుని లాయర్‌గా పనిచేసి, రాజ్యాంగాన్ని నమ్ముకుని రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. నా ఎదుగుదల, ప్రజాదరణ చూసి భరించలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.”
• “ప్రధాని, హోంమంత్రి జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్లను స్వీకరించాలని చెబుతారు. కానీ బండి సంజయ్ మాత్రం అలాంటి వారిని అవమానపరుస్తారు.”
 
సీతక్క స్పందన:
• “బండి సంజయ్ వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి. మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చేసే ప్రయత్నాలు సఫలం కావు. ములుగు ఎన్కౌంటర్ ఘటనపై మా ప్రాంతంలో శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను. అందరూ సమానత్వంతో, భద్రంగా జీవించాలి.”
• “నేను 20 ఏళ్ల రాజకీయ జీవితం గడపగా, దొడ్డి దారుల్లో పదవులు పొందలేదు. ప్రజల మద్దతుతోనే మంత్రిగా సేవలు అందిస్తున్నాను. మతాలు, కులాల పేరుతో విద్వేషాలు రగుల్చే రాజకీయాలు చేయడం నాకు రాదు.”
 
సీతక్క తన ప్రసంగాలను మార్ఫింగ్ చేసి, తనకు అవమానం చేసే ప్రయత్నాలను ఖండించారు. “ప్రజల మద్దతు మా వెంటే ఉంది, మానసికంగా ఇబ్బందులకు గురిచేసే చర్యలను తట్టుకుని, ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాను,” అని చెప్పారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .