కీసర శ్రద్ధ జూనియర్, స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు
కీసర, సెప్టెంబర్ 27(తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, కీసర మండలం తెలంగాణ సాంప్రదాయ పండుగ బతుకమ్మను పురస్కరించుకొని కీసర శ్రద్ధ జూనియర్, స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థినులు, అధ్యాపక బృందం, కళాశాల నిర్వహణ సమన్వయంతో ఈ కార్యక్రమం ఆనందోత్సాహాలతో సాగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కీసర మాజీ ఎంపీపీ సుజాత, కళాశాల ప్రిన్సిపల్ మదర్, వైస్ ప్రిన్సిపల్ నరసింహ హాజరై విద్యార్థినులను ప్రోత్సహించారు. సుజాత మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయ పండుగలలో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉందని, పూలతో చేసే ఈ పండుగ స్త్రీ శక్తి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. విద్యార్థులు ఇలాంటి పండుగలను తరతరాలకు పరిచయం చేయాలని సూచించారు.
ప్రిన్సిపల్ మదర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాక, సమాజంలో ఐక్యత, సౌభ్రాత్రుత్వాన్ని పెంపొందించే గొప్ప ఉత్సవమని అన్నారు.
కళాశాలలో ప్రతీ విద్యార్థి ఇలాంటి సాంప్రదాయ ఉత్సవాలలో పాల్గొని సంస్కృతిని నిలబెట్టాలని పిలుపునిచ్చారు.
విద్యార్థినులు సాంప్రదాయ దుస్తుల్లో హాజరై పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఎత్తిపట్టుకొని పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ కళాశాల ఆవరణను సందడితో మార్మోగించారు. బతుకమ్మ చుట్టూ కూయిలి, తాళాలు మోగించి విద్యార్థినులు పాటలు పాడటం, ఆటపాటలతో సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం రంగురంగుల పూలతో, విద్యార్థుల ఆనందోత్సాహాలతో పండుగ వాతావరణంగా మారిపోయింది


Comments