భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలి

భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలి

భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలి

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలని  హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం భద్రకాళి చెరువులో చేపట్టిన పూడికతీWhatsApp Image 2024-11-27 at 7.12.14 PMత పనులను  హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పరిశీలించారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులకు సంబంధించిన వివరాలను సాగునీటిపారుదల శాఖ అధికారులను కలెక్టర్లు అడిగి తెలుసుకున్నారు. పూడికతీత పనులకు సంబంధించి  సాగునీటి పారుదల, రెవెన్యూ, కుడా, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్లు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 

 ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ భద్రకాళి చెరువు పూడికతీత పనులకు సంబంధించి సర్వే చేసి దేనికి ఎంత ఖర్చవుతుందనే వాస్తవ అంచనాలను తయారు చేయాలని సాగునీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. పూడిక తీసిన మట్టిని  డంపింగ్ చేసేందుకు స్థలాలను గుర్తించాలని ఆర్డీవోలను ఆదేశించారు. చెరువు మట్టి కావాలని దరఖాస్తు చేసుకున్న  ప్రజలతో అధికారులు సమావేశం నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా కుడా అధికారులు మూడు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసేందుకు కార్యాచరణ ప్రణాళికను  రూపొందించగా కలెక్టర్ ఆమోదం తెలిపారు.  

 ఈ కార్యక్రమంలో హనుమకొండ వరంగల్ ఆర్డీవోలు రాథోడ్ రమేష్, సత్యపాల్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ సీఈ అశోక్ కుమార్, ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ సీతారాం, కుడా పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .