వనపర్తికి కేంద్రీయ విద్యాలయం మంజూరు పట్ల బిఆర్ఎస్ నాయకుల హర్షం

పెద్దమందడి మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి

వనపర్తికి కేంద్రీయ విద్యాలయం మంజూరు పట్ల బిఆర్ఎస్ నాయకుల హర్షం

పెద్దమందడి,అక్టోబర్8(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడంపై పెద్దమందడి మండల బిఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా  మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి మాట్లాడుతూ ..
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముందుచూపుతో, మోజర్ల గ్రామ రైతులను స్వయంగా ఒప్పించి కేంద్రీయ విద్యాలయ స్థాపన కోసం భూమిని ప్రతిపాదించడం జరిగిందన్నారు 
 అలాగే, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కృషి మాజీ ఎంపీ రాములు చొరవతో వనపర్తిలో కేంద్రీయ విద్యాలయం ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అని పేర్కొన్నారు.అదే విధంగా పెద్దమందడి మండలం మోజర్ల శివారులోని సర్వే నంబర్ 331లో ఉన్న ఎనిమిది ఎకరాల భూమిని కేంద్రీయ విద్యాలయం కోసం కేటాయించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.ఆ భూమి జాతీయ రహదారి సమీపంలో ఉండటం వల్ల రవాణా సౌకర్యాల పరంగా ఈ ప్రాంతం అనుకూలంగా ఉందని, కాబట్టి కేంద్రీయ విద్యాలయం మోజర్ల గ్రామ శివారులోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు.కేంద్రీయ విద్యాలయం మంజూరుకు హర్షం వ్యక్తం చేస్తూ.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ రాములకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వేణు యాదవ్, మాజీ గ్రామ రైతుబంధు అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డిIMG-20251008-WA0007, సీనియర్ నాయకులు చిత్తూరు కృష్ణారెడ్డి, సుద్దబాయి రాజు, మనీగిళ్ల రామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .