చలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరిన బిఆర్ఎస్ నాయకులు
కాజిపేట్ తెలంగాణ ముచ్చట్లు
కాజీపేట నగరానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు చలో ఢిల్లీ కార్యక్రమానికి శనివారం ఉదయం ఢిల్లీకి ప్రయాణమయ్యారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో 60 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, కాజీపేట జంక్షన్ ను డివిజన్ చేయాలని, కాజీపేట స్టేడియంలో బస్టాండ్ కు స్థలం ఇవ్వాలని, స్టేషన్ రోడ్డు వ్యాపారులకు రైల్వే స్థలంలో స్టాల్స్ నిర్మించాలని , కాజీపేట రైల్వే స్టేషన్ నుండి బోడ గుట్ట ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కేంద్ర రైల్వే మంత్రి కి సమర్పించడం అలాగే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగే ధర్నా కార్యక్రమానికి పాల్గొనుటకు బిఆర్ఎస్ నాయకులు బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శంకు నర్సింగరావు బిఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగరి రమేష్ టిఆర్ఎస్ అర్బన్ జిల్లా మాజీ కార్యదర్శి 47 వ డివిజన్ అధ్యక్షులు దువ్వ కనకరాజు, సిరిమల దశరథం, అఫ్జల్ , కొండ్ర శంకర్ , అశోక్ ,బరిగల వినయ్, రాబర్ట్ తదితరులు పాల్గొన్నారు.


Comments