కల్వకుర్తి అభివృద్ధిపై అసత్య ఆరోపణలు తగదు
కాంగ్రెస్ నేతల ఆగ్రహం
తలకొండపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తలకొండపల్లి మండలంలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. గట్టు ఇప్పలపల్లిలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
జైపాల్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని, నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించారు. ఇటీవల మంత్రి జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కల్వకుర్తిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సంగతి గుర్తుచేశారు.
గట్టుప్పలపల్లిలో అభివృద్ధి నేనే చేశానన్న జైపాల్ యాదవ్ ఆత్మ పరీశీలన చేసుకోవాలని సూచించారు. ఆ పనులు ఎవరి కృషితో జరిగాయన్న సంగతి ప్రజలకు తెలుసన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తరఫున తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ మ్యాక శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ హరికిషన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇంద్రకంటి శివకుమార్, సీనియర్ నాయకులు గాదే రేణు రెడ్డి, మిన్నాల దామోదర్, మాజీ వార్డ్ సభ్యులు చంద్రమౌళి, నరేందర్ గౌడ్, మట్టా అంజయ్య, మచ్చేందర్, సొప్పరి శ్రీనివాస్, రాములు, రాహుల్, రమేష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు


Comments