కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగల అభివృద్ధికి కృషి చేయాలి
ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ హక్కుల దండోరా సమావేశం
తార్నాక, సెప్టెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
మాదిగల అభివృద్ధి కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని మాదిగ హక్కుల జాతీయ అధ్యక్షుడు దండు సురేందర్ మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర్ మాదిగ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ లోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ఆదివారం జరిగిన మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు.
నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తీవ్రంగా విమర్శించారు. "అంబేద్కర్ అభయ హస్తం" పేరుతో రూ.12 లక్షలు ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు అమలు కాలేదని, "రాజీవ్ యువ వికాసం" కూడా కేవలం దరఖాస్తుల దశలోనే ఆగిపోయిందని ఆరోపించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల గమ్యం ఎవరికీ తెలియకపోవడం దురదృష్టకరమన్నారు.లెదర్ ఇండస్ట్రీ అభివృద్ధి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు తోలు పాదరక్షల ఎగుమతుల ద్వారా వేల కోట్ల ఆదాయం సంపాదిస్తున్నాయని, తెలంగాణలో కూడా లెదర్ ఇండస్ట్రీ పార్కులను పునరుద్ధరిస్తే పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని సూచించారు. ఈ పార్కుల ద్వారా ఐదు లక్షల మందికి ప్రత్యక్షంగా, పది లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. ముఖ్యంగా లిడ్ క్యాప్ భూములను కబ్జాలకు గురికాకుండా రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.విద్య, ఉపాధి సమస్యలు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పి ఎస్ సి) నిరుద్యోగ యువతతో అన్యాయం చేస్తోందని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్-1 విషయంలో హైకోర్టు సూచనలు వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.నాయకుల పాల్గొనడం ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల శ్యామ్ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ మాదిగ, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రేణికుంట్ల కుమార్, నాయకులు సాల్మన్ మాదిగ, కరుణాకర్ మాదిగ, కొలుగురి విజయ్ కుమార్ మాదిగ, పోత్తూరి రమేష్ మాదిగ, ఓయూ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొర్ర శాంతి కుమార్, శ్రీనివాస్ మాదిగ, స్వామి మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Comments