పాలేరు నియోజకవర్గం గుండా ప్రతిపాదించిన రెండు  రైల్వే లైన్లను మార్చండి

ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్ ను కోరిన ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి 

పాలేరు నియోజకవర్గం గుండా ప్రతిపాదించిన రెండు  రైల్వే లైన్లను మార్చండి

* డోర్నకల్‌ నుంచి మిర్యాలగూడ (జాన్ పహాడ్‌), గద్వాల్‌ బీజీ రైల్వే లైన్‌ అలైన్‌మెంట్‌ పునఃపరిశీలించండ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

పాలేరు నియోజకవర్గ అన్ని మండలాల్లోని సారవంతమైన భూముల్లోంచి, స్తంభాద్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) అతి ఖరీదైన స్థలాల్లోంచి వెళ్లేలా ప్రతిపాదించిన  డోర్నకల్ - మిర్యాలగూడ, గద్వాల రైల్వే లైన్ తో ఇక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోతారని.. లైన్ ను కచ్చితంగా మార్చాల్సిందేనని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి  రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ను కోరారు. ఢిల్లీలో గురువారం రైల్వే ప్రధాన కార్యాలయంలో ఆయనను కలిసి.. ఈ మేరకు విన్నవించారు. డోర్నకల్ నుంచి వయా పాపడ్ పల్లి - జాన్ పహాడ్ ( మిర్యాలగూడ), అలాగే డోర్నకల్- గద్వాల రైల్వే లైన్లు పూర్తిగా పాలేరు నియోజకవర్గo మీదుగా వెళ్లనుండడంతో.. ఈ ప్రాంత వాసులకు తీరని నష్టం చేకూరుతుందని అన్నారు. రైతులు సారవంతమైన భూముల్ని కోల్పోతారని తెలిపారు.
ప్రత్యామ్నాయ రైల్వే లైనే ఉత్తమం
 ఖమ్మంలో అదనంగా.. మూడో రైల్వే లైన్ నిర్మాణం పూర్తి దశకు వచ్చిందని.. ఇక్కడికి ఆరు జాతీయ రహదారులతో అనుసంధానం ఉందని.. ఈ ప్రాంతంలో కొత్తగా రైల్వే లైన్ తో ప్రజలను తీవ్రంగా నష్టపరచడం కంటే.. ప్రత్యామ్నాయ మార్గం చూడటమే ఉత్తమమని ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సూచించారు. కొత్త లైన్  పూర్తిగా పాలేరు నియోజకవర్గంలోంచే వెళ్తుండడంతో.. ఇక్కడ భూముల సేకరణకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందని, భారీ  వ్యయంతో కూడిందని తెలిపారు. ప్రత్యామ్నాయంగా సూచిస్తున్న.. డోర్నకల్- వయా వెన్నారం, మన్నెగూడెం, మరిపెడ, మోతేలమీదుగా  కొత్త లైన్ నిర్మించాలని సూచించారు. 
మరిపెడ.. మోతే మీదుగా అయితే దూరం, వ్యయభారం తగ్గుతాయి..
 డోర్నకల్- మిర్యాలగూడ(జాన్ పహాడ్) నూతన రైల్వే లైన్ ను పాలేరు నియోజకవర్గo మీదుగా కాకుండా..  ప్రత్యామ్నాయ వెన్నారం..మన్నెగూడెం, మరిపెడ, మోతే మీదుగా నిర్మిస్తే.. మొత్తం 124 కిలోమీటర్ల నుంచి  19 కి. మీ. దూరం తగ్గుతుందని ఎంపీ రామసహాయం  రఘురాం రెడ్డి  రైల్వే బోర్డు  చైర్మన్ కు వివరించారు. అలాగే.. భూ సేకరణ వ్యయం బాగా తగ్గి.. ఇటు లైన్ నిర్మాణ ఖర్చుకు సంబంధించి ప్రభుత్వానికి,  రైల్వేకు రూ.  కోట్లాది రూపాయలు ఆదా అవుతాయని  తెలిపారు. 
పాలేరుకు బదులు.. ప్రత్యామ్నాయ రైల్వే మార్గం చూస్తాం..: హామీ ఇచ్చిన రైల్వే బోర్డు చైర్మన్ ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి.. ఇచ్చిన వినతి,  పాలేరు నియోజకవర్గంలో  వందలాదిమంది ఇబ్బంది పడుతున్నారన్న వివరణతో రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సతీష్ కుమార్ స్పందించారు. తీవ్రంగా నష్టపరచనున్న కొత్త రైల్వే లైన్ పై  పాలేరు నియోజకవర్గ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని.. ఎంపీ సుదీర్ఘంగా, సవివరంగా తెలియజేయడంతో రైల్వే బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించారు. ఇంతకుముందు అనుకున్న లైన్ పై.. పున: పరిశీలన చేస్తామని అన్నారు. కచ్చితంగా.. ఈ లైన్ కు బదులు.. ప్రత్యామ్నాయంగా ఎంపీ గారు సూచిస్తున్న.. డోర్నకల్ - వెన్నారం, మన్నెగూడెం, మరిపెడ, మోతే మీదుగా కొత్త రైల్వే లైన్  ను నిర్మిస్తామని ఎంపీ రఘురాం రెడ్డి గారికి అభయమిచ్చారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .