సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చంటి ముదిరాజ్ 

సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చంటి ముదిరాజ్ 

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చంటి ముదిరాజ్ ను ఏకగ్రీవముగా ఎన్నుకున్నట్లు అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా చంటి ముదిరాజ్ కు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా చంటి ముదిరాజ్  తనపై నమ్మకంతో జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించిన జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ కు,జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు కు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం చంటి ముదిరాజ్ మాట్లాడుతూ ఈ సమాచార హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల నుంచి సహకారం లభించడం లేదన్నారు. అధికారుల్లో జవాబుదారితనం కొరవడిందన్నారు. సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో ఆ వ్యక్తికి కోరిన సమాచారం అందించాల్సిన బాధ్యత ఆయా అధికారులపై ఉందన్నారు. నిర్ణీత సమయంలోపు అందించకపోతే అప్పిలేట్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చన్నారు. ఇక్కడా స్పందన రాకపోతే రాష్ట్ర సమాచార చట్టం చీఫ్ కమిషనర్ కు అప్పీల్ చేసుకోవాలన్నారు. కమిషన్ స్పందించి సంబంధిత అధికా రులపై చర్యలు తీసుకుంటుందన్నారు.సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును నిరాకరించే అధికారం ప్రభుత్వ వ్యవస్థలో ఏ శాఖ, అధికారికి లేదన్నారు. సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి బయటకు తీస్తూ సమాచార హక్కు చట్టం గురించి పౌరులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు,నంగునూరు మండల అధ్యక్షులు అశోక్ యాదవ్,గుండెల రాయుడు,బోదాస్ జగన్, ఎం.డి మున్న,జి.భాను ప్రసాద్, వెంకటేష్ యాదవ్,నమిండ్ల హరీష్,పాల్గొన్నారు..

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .