గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్

గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం,తెలంగాణ ముచ్చట్లు: 

2025-26 విద్యాసంవత్సరానికి తెలంగాణ గురుకులాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ బాలబాలికలకు ఇంగ్లీష్ మీడియంలో ఐదవ తరగతిలో ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ ప్రకటించారు. ఈ పరీక్ష ద్వారా మెరిట్ ఆధారంగా నిష్ణాతులైన విద్యార్థులను ఎంపికచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

తన కార్యాలయంలో ఆర్‌సిఒ గురుకులం నాగార్జునరావు, ప్రిన్సిపాల్ సమక్షంలో ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు సంబంధించిన ఫ్లెక్సీలు, కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, ఐదవ తరగతి ప్రవేశాలకు మాత్రమే కాకుండా, ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు బ్యాక్‌లాగ్ ప్రవేశాలకూ దరఖాస్తులు స్వీకరించబడతాయని తెలిపారు. అలాగే ఎస్‌ఓఈ పాఠశాలలో 8వ తరగతిలో ప్రవేశాలకు కూడా ఈ ప్రక్రియ వర్తిస్తుందని వెల్లడించారు.

దరఖాస్తుదారులు https://tgcet.cgg.gov.in ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. దరఖాస్తుకు కులం సర్టిఫికెట్ నంబర్, ఆదాయం సర్టిఫికెట్ నంబర్, ఆధార్ కార్డు నంబర్, బర్త్ సర్టిఫికెట్, మరియు విద్యార్థి ఫోటో తప్పనిసరిగా జతచేయాలని సూచించారు.

సర్టిఫికెట్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయన్నవారికి జిల్లా కలెక్టరేట్‌లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దరఖాస్తులను 2025 ఫిబ్రవరి 1 నాటికి పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, వైస్ ప్రిన్సిపాల్ హేమలత, ఫ్యాకల్టీ సభ్యురాలు సరోజినీ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యలో సమానత్వం కోసం చేస్తోన్న కృషిలో భాగంగా ఈ ప్రవేశ పరీక్ష కీలకమైనది అని రాహుల్ పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .