మునుగోడు నియోజకవర్గానికి చిన్న నీటి వనరుల పటిష్టతకు సమగ్ర ప్రణాళిక
Views: 2
On
మునుగోడు,తెలంగాణ ముచ్చట్లు:
మునుగోడు నియోజకవర్గంలోని చిన్న నీటి వనరులను పటిష్టం చేయడానికి నీటిపారుదల శాఖ అధికారులతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమీక్ష నిర్వహించి సమగ్రమైన కార్యాచరణ రూపొందించారు. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతమైన మునుగోడులో కురిసే ప్రతి నీటిబొట్టును చెరువులకు మళ్లించి భూగర్భ జలాల పెరుగుదలతో పాటు వ్యవసాయానికి మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు.
నియోజకవర్గంలో ఉన్న 669 చెరువులలో గొలుసు కట్టు చెరువులకు నీరందించే ఫీడర్ ఛానళ్లను పటిష్టం చేయడం, చెరువులలో పేరుకుపోయిన పూడికను తొలగించడం, కట్టలను బలపరచడం వంటి పనులను విడతల వారీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ చర్యలు భూగర్భ జలాలను పునరుద్ధరించి, నీటి వనరుల నిర్వహణను మెరుగుపరిచే దిశగా కీలకంగా ఉండనున్నాయి.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments