బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత సాధించడంలో కాంగ్రెస్ వైఫల్యం

మాజీ ఎంపీ నామ

బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత సాధించడంలో కాంగ్రెస్ వైఫల్యం

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 10 , తెలంగాణ ముచ్చట్లు:

బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమైందని బిఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో.9పై హైకోర్టు స్టే ఇవ్వడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయమై నామ స్పందిస్తూ బీసీల హక్కులు, అవకాశాలను రక్షించాల్సిన బాధ్యత ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఆయన విమర్శించారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకొనిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు.  కానీ నేడు రాష్ట్రం లో బీజేపీ, కాంగ్రెస్ నుండి పదహారు మంది ఎంపీలు వుండి కూడా బీసీ రేజర్వేషన్ల విషయమై ఏనాడు కూడా పార్లమెంట్ ను స్థంబింపజేయలేదని, కనీసం వారి హక్కుల కోసం పోరాటం చేయలేదన్నారు.  రెండు పార్టీలు కూడా బీసీ లను మోసం చేశాయన్నారు.   కాంగ్రెస్, బీజీపీ రెండు పార్టీల ద్వంద వైఖరి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా పార్లమెంటులో చట్టం ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.  కేసీఆర్ సూచనలు మేరకు బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిన తీరు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సక్రమంగా సిద్ధం చేయకపోవడం, చట్టపరమైన ప్రక్రియలు పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.  ఎన్నికల ముందు బీసీ వర్గాల అభ్యున్నతి పేరుతో గొప్ప హామీలు ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలను మరిచిపోయిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం చట్టబద్ధమైన మార్గంలో ముందుకు సాగకపోవడం వల్ల బీసీ వర్గాల ఆత్మగౌరవం దెబ్బతింటోందని మాజీ ఎంపీ నామ ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు తర్వాత అయినా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల హక్కులు, ప్రయోజనాలను కాపాడే దిశగా సక్రమమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. బీఆర్ఎస్ పాలనలో బీసీలకు గౌరవం, హక్కులు రెండూ సమానంగా లభించాయి. కానీ కాంగ్రెస్ పాలనలో మళ్లీ నిర్లక్ష్యం తాలూకు చీకట్లు కమ్ముకుంటున్నాయన్నారు. బీసీల హక్కులు, గౌరవం రక్షించడంలో బిఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .