అభివృద్ధి పనులు ప్రారంభించిన కార్పొరేటర్
మల్కాజిగిరి, అక్టోబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజిగిరి సర్కిల్ వినాయక్ నగర్ డివిజన్‌లోని నవభారత్ స్కూల్ నుంచి డీఏవీ స్కూల్ వరకు రూ. 48 లక్షల వ్యయం తో, అలాగే వినాయక్ నగర్ రెండో వీధిలో రూ. 23 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో, కార్పొరేటర్ అనంతరం రేణుక నగర్‌లో జరుగుతున్న బాక్స్ డ్రైనేజీ పనులను కూడా పరిశీలించారు. ఈ సందర్భం లో కార్పొరేటర్‌తో కలిసి బీజేపీ నాయకులు ఓం ప్రకాష్, మంగేష్, సాయిసురేష్, గోపినాధ్, శంకర్, సాయిరాం, సంతోష్, జ్యోతిర్మయి, అలాగే కాంగ్రెస్ నేత పిట్టల శ్రీనివాస్ హాజరయ్యారు. ప్రభుత్వ అధికారులు ఈఈ లక్ష్మణ్, డీఈ లౌక్య, ఏఈ నవీన్ కుమార్, లక్ష్మి, సుశీల, శ్రీధర్ తదితరులు కూడా పాల్గొన్నారు.ఈ పనులు సమీప ప్రాంతాల రవాణా సౌలభ్యం పెరగడం, నీటి కాలువల సమస్యలు తగ్గించడం మరియు స్థానిక వాసుల జీవితాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర వహిస్తాయని అధికారులు తెలిపారు.


Comments