మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారికీ కౌన్సిలింగ్..

ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు

మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారికీ కౌన్సిలింగ్..

ఖమ్మం బ్యూరో, నవంబర్ 26, తెలంగాణ ముచ్చట్లు;

మద్యం మత్తులో ప్రయాణం చేయడం ద్వారా తమ విలువైన ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఎదుటి వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు అన్నారు. 
నగరంలో నిర్వహించిన  స్పెషల్ డ్రైవ్ లో మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడిన 39మంది వాహనదారులకు  జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు ఆనంతరం వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ...  మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాలకు గురై
ఎంతోమంది ప్రాణాలూ పోగొట్టుకుంటున్నప్పటికి 
వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం,వాహనం ఎటువైపు వెళ్తుందనే ధ్యాస లేకపోవడం, ఒకరు చేసే తప్పు వేరొకరి ప్రాణాల మీదకు తెస్తోందని అన్నారు, 
రహదారి భద్రతా నియమావళిని పాటించకుండా నిబంధనలను బేఖాతరు చేస్తూ వాహనాలు నడుపుతున్న వారి వల్లనే ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వివరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .