హామీల అమలు కోసం సిపిఐ (ఎం ) పార్టీ నిరంతర పోరాటం

సిపిఐ (ఎం )పార్టీ హనుమకొండ జిల్లా బహిరంగ సభ 

హామీల అమలు కోసం సిపిఐ (ఎం ) పార్టీ నిరంతర పోరాటం

హసన్ పర్తి బస్ స్టాండ్ నుండి శుభమస్తు గార్డెన్స్ వరకు భారీ ప్రదర్శన,ర్యాలీ 


WhatsApp Image 2024-12-14 at 6.29.34 PM

 హసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత 10సంవత్సరాల నుండి అనుసరిస్తున్న  ఉదారవాద ఆర్థిక విధానాలు పారిశ్రామిక, వ్యవసాయ రంగాన్ని దివాళా తీశాయని సిపిఐ (ఎం )తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.శనివారం హసన్ పర్తి మండల కేంద్రంలోని శుభమస్తు గార్డెన్స్ లో హనుమకొండ జిల్లా సిపిఐ (ఎం ) పార్టీ బహిరంగ సభ జరిగింది.బహిరంగ సభకు ముఖ్య అతిదులుగా సిపిఐ (ఎం ) రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం, సిపిఐ (ఎం ) కేంద్ర కమిటీ సభ్యులు జి. నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు హాజరయ్యారు.ఈ సందర్బంగా వీరభద్రం మాట్లాడుతూ దేశంలో ఆర్థిక అసమానతలు పెద్ద ఎత్తున పెరిగాయని, ప్రజలు చెమటోడ్చి నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అంబాని, అదానీ లాంటి బడా కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా కట్టబెడుతుందని అన్నారు. జి. నాగయ్య, పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ
దేశంలో ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులు రాష్ట్రాల హక్కులపై రాజ్యాంగంపై దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు అనేక ఆశలు పెట్టుకున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాలయాపన చేస్తుందని అన్నారు.హామీల అమలు కోసం సిపిఐ (ఎం ) పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కార్యదర్శి చక్రపాణి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి,చుక్కయ్య,జిల్లా కమిటీ సభ్యులు రాగుల రమేష్, వాంకుడోట్ వీరన్న, వెంకట్, దీప,తిరుపతి, హసన్ పర్తి మండల కార్యదర్శి గుమ్మడిరాజుల రాములు,పుల్ల అశోక్,తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .