దమ్మాయిగూడ–నాగారం రహదారి గుంతల మయం

వాహనదారుల నడుములు విరిగే పరిస్థితి

దమ్మాయిగూడ–నాగారం రహదారి గుంతల మయం

-వర్షాల వల్ల ప్రమాదాల పెరుగుదల

-విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు

దమ్మాయిగూడ, ఆగస్టు 19(తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలం దమ్మాయిగూడ చౌరస్తా నుండి నాగారం వరకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో నిండిపోవడంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేయాలంటే నడుములు విరిగిపోతున్నాయన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది.ఈ సమస్యపై స్థానికులు పలుమార్లు సంబంధిత అధికారులను సంప్రదించినా పట్టించుకునే వారు లేరని విమర్శిస్తున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా రహదారి పరిస్థితి మాత్రం అలాగే కొనసాగుతుందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రహదారిపై గుంతలు నీటితో నిండిపోవడంతో ప్రమాదాలు పెరిగాయి. ఇప్పటికే ఐదుగురు వాహనదారులు గుంతల్లో పడి గాయపడ్డారని సమాచారం. చిన్న దూరం వెళ్లాలన్నా 30 నుండి 45 నిమిషాలు పడుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోజూ స్కూల్స్‌కి వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ వెంకటరెడ్డి, ఆర్‌అండ్‌బి అధికారి విట్టలయ్యలను సంప్రదించగా, రాబోయే రెండు రోజుల్లో గుంతలను పూడుస్తామని హామీ ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .