రాఖి వేడుకలలో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్ మల్లిబాబు యాదవ్ 

రాఖి వేడుకలలో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్ మల్లిబాబు యాదవ్ 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

 శ్రావణ పౌర్ణమి సందర్భంగా జరిగిన రక్షాబంధన్ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ కుటుంబ సభ్యులతో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ ఈ ప్రపంచంలో సోదర, సోదరీమణుల అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు అనుబంధం,ప్రేమ అతి పవిత్రమైనదని, ఒక సోదరి కట్టే రక్షాబంధనం అంటే మెట్టినింటిలో తనకు ఆపద వచ్చిన రాకున్నా ఒక సోదరుడుగా నాకు రక్షగా ఉండాలని రక్షాబంధనం కడితే ఆ గుర్తుగా జీవితకాలం తోడుంటానని ఒక సోదరుడు చేసే ప్రతిజ్ఞ రాఖీ పండుగని, అనాదిగా హిందూ సాంప్రదాయపరంగా వచ్చే ఈ రక్షాబంధనం ఈ రోజులలో కూడా మరిచిపోకుండా అందరూ జరుపుకోవడం చాలా గొప్ప విషయమని అభివర్ణించారు. ఈ స్పీడ్ యుగంలో కూడా కనీసం ఈ రోజైనా సోదర సోదరీమణులు మనసు విప్పుకుని మాట్లాడే సమయం దొరుకుతుందని, గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారని, గతంలో ఏవైనా కుటుంబ కలహాలు మనస్పర్ధలు జరిగి ఉంటే వాటిని మర్చిపోయి అన్నా చెల్లెలు కలిసిపోతారని ప్రతి ఒక్కరూ ఈ పండగను ఆనందంతో సంతోషంతో జరుపుకోవాలని మళ్లీ బాబు యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చెల్లెల్లు సైదమ్మ, పద్మ.కుటుంబ సభ్యులు ధనలక్ష్మి. కవిత తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .