హన్మకొండలో దీక్ష దీవాస్ .
పోరుగడ్డపై హోరెత్తిన గులాబీ దండు
-తెలంగాణ ఉద్యమాన్ని తలపించిన దీక్షదివాస్
-బిఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ నింపిన దీక్షదివాస్
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివాస్ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. హన్మకొండ, జనగాం జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ నాయకులతో కలిసి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ మాజీ శాసనసభ్యుడు తాటికొండ రాజయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గుర్తుచేసుకుంటూ,శుక్రవారం నిర్వహించిన దీక్షా దివాస్ ఉద్యమానికి ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బయటపెట్టడం, మరోసారి ప్రజల్లో ఉద్యమజ్వాల రగిలించడం దీక్షా దివాస్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.కేసీఆర్ నాయకత్వంపై ప్రజల మద్దతు ఇంతగొప్పగా కనిపించడం ఆనందకరమని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తప్పులను ఎత్తిచూపుతూ బీఆర్‌ఎస్ ప్రజల తరఫున పోరాటాన్ని కొనసాగిస్తుందని రాజయ్య అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగాం శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇతర ప్రముఖ నాయకులు, పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Comments