డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల పంపిణీ.
దమ్మపేట, నవంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
అశ్వారావుపేట నియోజకవర్గంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. దమ్మపేట మండలం పట్వారిగూడెం గ్రామంలోని చెలికాని ఆదెమ్మ ఫంక్షన్ హాల్‌లో ఇందిర మహిళా శక్తి కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు చెక్కులు అందజేశారు. ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ వడ్డీలేని రుణాలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. గ్రామీణ మహిళలు చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి రంగాల్లో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో 60కి పైగా సర్పంచ్ స్థానాలు మహిళలకు కేటాయించడం జరిగినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.


Comments