ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం బ్యూరో,తెలంగాణ ముచ్చట్లు :
త్రైమాసిక తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో గల ఈవిఎం గోడౌన్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా ఉన్న బ్యాలెట్, కంట్రోల్ యూనిట్ లు భద్రపరిచిన గదులను, మొదటి అంతస్తులో భద్రపరిచిన వి.వి. ప్యాట్ గది సీల్ ను రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారుల సమక్షంలో గదులకు ఉన్న సీల్ ను చూసి ఓపెన్ చేసి పరిశీలించారు. అనంతరం అందరి సమక్షంలో తిరిగి సీల్ వేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈవిఎం గదులలో ఎక్సాస్ట్ ఫ్యాన్ ఉన్న ప్రదేశంలో బయటి వైపు మెస్ జాలి ఏర్పాటు చేయాలని, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల్లో చెత్త చేరకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. సంబంధిత రిజిస్టర్ లను పరిశీలించి తనిఖీ రిజిస్టర్ లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు.జిల్లా కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సిహెచ్. స్వామి, కలెక్టరేట్ ఎన్నికల డిటి అన్సారీ, అగ్నిమాపక శాఖ అధికారి నాగరాజు, రాజకీయ పార్టీ ప్రతినిధులు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి పి. శ్రీనివాస్, బిజేపి పార్టీ ప్రతినిధి జి. విద్యాసాగర్, సి.పి.ఎం. పార్టీ ప్రతినిధి ప్రభాకర్, బి.ఆర్.ఎస్. పార్టీ ప్రతినిధి కె. ఉమా శంకర్, టి.డి.పి. పార్టీ ప్రతినిధి పి. కృష్ణప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి హుస్సేన్,అధికారులు, తదితరులు ఉన్నారు.


Comments