రేపు ఖమ్మం కు డాక్టర్ కే ఏ పాల్ రాక 

సర్పంచ్ లు  మేధావులతో ఆత్మీయ సదస్సు

రేపు ఖమ్మం కు డాక్టర్ కే ఏ పాల్ రాక 

మీడియాతో ముఖాముఖి

ఖమ్మం బ్యూరో,తెలంగాణ ముచ్చట్లు:

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కేఎ పాల్ శనివారం ఖమ్మం రానున్నారు. ప్రజాశాంతి పార్టీని మరింత ప్రతిష్ట పరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ లు, పలు సామాజిక వర్గాలకు చెందిన  మేధావులతో జిల్లాల వారిగా ఆయన ఆత్మీయ  సదస్సులను నిర్వహిస్తున్నారు. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికలే లక్ష్యంగా రానున్న గ్రామపంచాయతీ ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా  క్యాంపియన్లు చెపడుతూ ఇప్పటికే పలు జిల్లాలలో సమావేశాలను పూర్తి చేశారు.
ఈనెల 4 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మంలోని బైపాస్ రోడ్డు లోని కృష్ణ ఫంక్షన్ హాల్ లో మీడియాతో ఆయన సంభాషించనున్నారు. అనంతరం  సర్పంచులు, మేధావులతో జరిగే ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎంపీటీసీలు, వివిధ సామాజికవర్గాలకు చెందిన మేధావులు పాల్గొని ఆత్మీయ సదస్సును విజయవంతం చేయాలని డాక్టర్ కె ఏ పాల్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .