చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన 

డివిజన్ అధ్యక్షులు కే శెట్టి ప్రసాద్

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన 

ఏఎస్ రావు నగర్, అక్టోబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గ కాప్రా సర్కిల్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్‌లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాలను డివిజన్ అధ్యక్షులు కే శెట్టి ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఐదేళ్ల లోపు చిన్నారులకు తల్లిదండ్రులు తప్పక పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు. దేశం పూర్తిగా పోలియో రహితంగా మారేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు.పోలియో చుక్కలు వేస్తున్న సిబ్బందికి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన కే శెట్టి ప్రసాద్ మాట్లాడుతూ, “పోలియోను అంతమొందించాలంటే ప్రతి తల్లిదండ్రుల బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి చిన్నారికి రెండు చుక్కల పోలియో వేయడం ద్వారా దేశ ఆరోగ్య భవిష్యత్తును కాపాడవచ్చు” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ రావు నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకులు అజీజ్, లింగస్వామి, బి. నరసింహ, ఎస్‌.ఎం. సాహెబ్, రావు, ఎస్‌.ఎం. పీరా వలి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .