ముప్పారం గ్రామంలో దుప్పట్ల పంపిణీ చేసిన ఈ69 తెలుగు గళం న్యూస్

ముప్పారం గ్రామంలో దుప్పట్ల పంపిణీ చేసిన ఈ69 తెలుగు గళం న్యూస్

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఈ69 తెలుగు గళం న్యూస్ ఆధ్వర్యంలో పేద దళిత వృద్ధులు, వితంతువులకు దుప్పట్లు పంపిణీ చేశారు. సమాజ సేవ లక్ష్యంగా స్టేట్ బ్యూరో ఎండి సలీం, హనుమకొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అనిల్ రాజ్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపీడీవో అనిల్ కుమార్, ఎంపీఓ సయ్యద్ అఫ్జల్, ఎస్సై నరసింహారావు, ఏఎస్ఐ సమ్మిరెడ్డి, గ్రామ కార్యదర్శి సురేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో అనిల్ కుమార్ మాట్లాడుతూ, చలి కాలంలో పేద ప్రజల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ69 తెలుగు గళం న్యూస్ సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రసంశనీయమన్నారు. మానవతా దృక్పథంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సమాజానికి ఆదర్శమన్నారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చామల మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గొల్లపల్లి వెంకటరాజ్యం, గ్రామ యువకులు, వివిధ రాజకీయ, సామాజిక నాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారికి ఈ69 రిపోర్టర్లు సన్మానం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .