కల్లూరు ప్రభుత్వ దవాఖానలో ఖాళీ కుర్చీ దర్శనం.

వైద్యాధికారి రాకపోకలపై ప్రజల్లో ఆగ్రహం.

కల్లూరు ప్రభుత్వ దవాఖానలో ఖాళీ కుర్చీ దర్శనం.

కల్లూరు, అక్టోబర్ 06 (తెలంగాణ ముచ్చట్లు):

ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో ప్రభుత్వ వ్యవస్థ గాడితప్పిందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సి.హెచ్.సి) పరిస్థితి చూస్తే అధికార నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.

సోమవారం ఉదయం 11 గంటలు దాటినా వైద్యాధికారి కార్యాలయంలో కనబడకపోవడం, ఆసుపత్రి అంతా ఖాళీ కుర్చీలతో వెలవెలబోయి ఉండడం ప్రజల్లో ఆగ్రహం రేపింది. విధులకు రాకుండానే ముందురోజే హాజరు పట్టికలో ‘ప్రజెంట్’గా సంతకం చేసుకుంటున్నారని సిబ్బంది వర్గాల్లో వినిపిస్తున్న ఆరోపణలు మరింత చర్చనీయాంశమయ్యాయి.

రోగులు ఆసుపత్రికి వచ్చి డాక్టర్ వస్తారో రారో తెలియక గంటల తరబడి ఎదురుచూస్తూ అవస్థలు పడుతున్నారు. వచ్చినా కేవలం రెండు గంటలపాటు మాత్రమే ఆసుపత్రిలో ఉంటారని, మిగతా సమయం ఆంధ్రప్రదేశ్‌లోని తిరువూరు పట్టణంలోని తన ప్రైవేట్ క్లినిక్‌లో గడుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ జీతం తీసుకుంటూ, ఆంధ్రాలో ప్రైవేట్ క్లినిక్ నడపడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు.

ఇక ఆసుపత్రికి వచ్చే కొందరు రోగులను తన ప్రైవేట్ క్లినిక్‌కి తరలిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వ దవాఖానను కొందరు తమ వ్యక్తిగత వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారనే విమర్శలు ఊపందుకున్నాయి.

వైద్యాధికారి మొబైల్ ఫోన్‌కూ స్పందించడం లేదని, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి నిర్లక్ష్యం కొనసాగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కల్లూరులోనే ఉన్న సబ్ కలెక్టర్ లేదా మెజిస్ట్రేట్ ఒక్కసారి ఆకస్మిక తనిఖీ చేస్తే పలు అవకతవకలు బహిర్గతమవుతాయి అని స్థానికులు అంటున్నారు. అంతేకాకుండా, పశువుల ఆసుపత్రి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో కూడా అధికారులు తరచూ విధులకు గైర్హాజరు అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.IMG-20251006-WA0033IMG-20251006-WA0034

ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న అధికారులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కల్లూరు ప్రజల డిమాండ్.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .