రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు
సన్న వరి ధాన్యాన్ని 500 బొనస్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది
- రైతులకు బోనస్ ఇస్తే ప్రతి పక్షాలకు మింగుడు పడటం లేదు
-రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
ములుగు,తెలంగాణ ముచ్చట్లు:
మధ్య దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు అని మంత్రి డాక్టర్ సీతక్క రైతులకు సూచించారు.
మంగళవారం ములుగు జిల్లా కేంద్రములో సహకార సంఘం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం దేశం భాగుంటుంది అని రైతులకు సన్న ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ బోనస్ 500 రూపాయలు చెల్లించడం జరుగుతుందని,కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను ఒక్కటిగా నెరవేరుస్తున్నం అని ప్రజా పాలన అందిస్తున్న మా ప్రభుత్వం పై ప్రతిపక్షాలు విషం కక్కుతూ విమర్శలు చెయ్యడం సబబు కాదని అన్నారు.మిగులు బడ్జెట్ ఉన్న మన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బిఆర్ఎస్ పార్టీ కి ప్రజలు బుద్ధి చెప్పిన వాళ్ళ బుద్ధి మారటం లేదని మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రైతులు బిఆర్ఎస్ నాయకుల నమ్మద్దూ అని ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీతక్క అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోథ్ రవి చందర్,సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి వైస్ చైర్మన్ మర్రి రాజు తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments