ఎస్సీ–ఎస్టీ అభ్యున్నతికి కొత్త కమిటీ ఏర్పాటు.!
సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో ఏకగ్రీవ ఎన్నికలు.
సత్తుపల్లి, డిసెంబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి ఆర్టీసీ డిపో ఎస్సీ–ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు స్థానిక విశ్వశాంతి స్కూల్‌లో జిల్లా కమిటీ సెక్రటరీ ఎన్. నాగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో పప్పుల రాఘవులు అధ్యక్షుడిగా, కల్లేపల్లి సర్వేశ్వరరావు కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్‌గా పప్పుల రాఘవులు, సెక్రటరీగా కల్లేపల్లి సర్వేశ్వరరావు, ట్రెజరర్‌గా మంచినీళ్ల ముత్తయ్య, జాయింట్ సెక్రటరీగా వేల్పుల వెంకట రమణ, వైస్ ప్రెసిడెంట్‌గా నార్లపాటి రాంబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మాలోతు వెంకటేశ్వర్లు, ప్రచార కార్యదర్శిగా కిన్నెర ఆనందరావు, గౌరవ సలహాదారుగా జొన్నలగడ్డ వెంకటయ్యలు బాధ్యతలు చేపట్టారు. అలాగే జొన్నలగడ్డ జగన్నాథం జిల్లా కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్ష–కార్యదర్శులు మాట్లాడుతూ, డిపోలోని ఎస్సీ–ఎస్టీ కార్మికుల సమస్యలను యాజమాన్యానికి తెలియజేసి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్మికుల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, డిపో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వేగవంతంగా పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్.టి. రావు, కె.ఎన్. రావు, కోట నల్లయ్య, పి. ఇజ్రాయిల్, బాలరావు, అనిల్ బాబు, సత్తిబాబు, వి.వి. రమణ, రాంబాబు, జి. రవికుమార్, రత్నాకర్, హుస్సేన్, ముత్తయ్య, రత్నరాజు, టీ. వెంకటకృష్ణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.


Comments