పలువురిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య 

పలువురిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య 

ధర్మసాగర్/చిల్పూర్,తెలంగాణ ముచ్చట్లు:

ధర్మసాగర్ మండలంలోని,ఎలుకుర్తి గ్రామంలో మాజీ ఎంపీటీసీ నరిశెట్టి సుధాకర్ తండ్రి నరిశెట్టి పెద్ద కొమురయ్య ఇటీవల మరణించగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఎలుకుర్తిలోని సుధాకర్ ఇంటిని సందర్శించి, కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి, తన సానుభూతిని తెలిపారు.

తదుపరి, మండలంలోని పెద్దపెండ్యాల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, డాక్టర్ రాజయ్య వీరాభిమాని వేలూరి కేశవరెడ్డి అత్తమ్మ పూండ్రు సుభద్ర మరణించినందున, డాక్టర్ తాటికొండ రాజయ్య ఆమె ఇంటిని సందర్శించి, సుభద్ర పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు.


మహిపాల్ ను పరామర్శించిన డాక్టర్ రాజయ్య 

WhatsApp Image 2024-12-01 at 8.06.28 PM
చిల్పూర్ మండలంలోని రాజవరం గ్రామంలో, డాక్టర్ రాజయ్య వీరాభిమాని, మాజీ ఉపసర్పంచ్ ఎడ్ల మహిపాల్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసుకున్న డాక్టర్ తాటికొండ రాజయ్య అతని ఇంటికి వెళ్లి మహిపాల్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి వైద్య సలహాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమాల్లో మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .