ఫలించిన మాజీ ఎంపీ నామ కృషి - రాష్ట్రానికి నాలుగు కేంద్రీయ విద్యాలయాలు

ప్రజల ఆశల సాకారం దిశగా మాజీ ఎంపీ నామ అడుగులు

ఫలించిన మాజీ ఎంపీ నామ కృషి - రాష్ట్రానికి నాలుగు కేంద్రీయ విద్యాలయాలు

రాష్ట్రంలో మాజీ ఎంపీ నామకు పలువురి కృతజ్ఞతలు

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 03, తెలంగాణ ముచ్చట్లు;

ఎట్టకేలకు మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు కృషి ఫలించింది. తెలంగాణ రాష్ట్రానికి నాలుగు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కావడంతో ఎంతోకాలంగా కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు కోసం మాజీ ఎంపీ నామా చేసిన పోరాటానికి ఫలితం దక్కినట్టు అయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలకు అభివృద్ధి ప్రాధాన్యం ఇస్తూ, కేంద్రీయ విద్యాలయాలను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో బిఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు నిరంతర కృషి చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రం విభజన అనంతరం జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తరువాత, విద్యా రంగ అభివృద్ధికి కీలకంగా మారిన కేంద్రీయ విద్యాలయాల మంజూరులో నామ పాత్ర విశేషమైందనే చెప్పాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు ఎంపీగా గెలిచిన నామ తన నియోజకవర్గానికి, రాష్ట్రానికి అనేక కేంద్ర పథకాలను తీసుకురావడంలో కృషి చేశారు. మొదటి సారి ఎంపీగా గెలిచినప్పటి నుంచే కేవీ బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల సమస్యలు, విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కోసం ఆయన నిరంతర పోరాటం కొనసాగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత, కొత్త జిల్లాలు వచ్చిన నేపథ్యంలో 17వ లోక్‌సభలో అనేక సార్లు పార్లమెంట్ లో రాష్ట్రనికి రావాల్సిన పలు కీలకమైన ప్రాజెక్టులపై ప్రశ్నలు అడగటంతో పాటు, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రికి లేఖలు రాసి విజ్ఞప్తులు చేసి సమస్యను ఢిల్లీ దాకా తీసుకెళ్లారు. దీర్ఘకాలిక కృషి ఫలితంగా కేంద్రం ఇటీవల నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలను తెలంగాణకు మంజూరు చేసింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు – యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కింద, ములుగు జిల్లా కేంద్రం లో , వనపర్తి జిల్లా – నాగవరం శివార్ లో , జగిత్యాల జిల్లా – చెల్గల్ లో నూతనంగా కేవీ లు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేవీ లు 35, కొత్తగా మంజూరైనవి 4తో వాటి సంఖ్య 39 కు చేరనున్నవి. దేశవ్యాప్తంగా 57 కొత్త కేవీ లు మంజూరైతే అందులో 20 ఇప్పటివరకు కేవీ లేని జిల్లాలుకు, 14 – ఆశావహ జిల్లాలు, 4 – ఎల్‌డబ్ల్యూ‌ఈ జిల్లాలు, 5 – ఈశాన్య రాష్ట్రాలు/పర్వత ప్రాంతాలు వున్నాయి.   భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేవీ మంజూరు కావడం ప్రత్యేక ప్రాధాన్యం కలిగింది. ఇది వెనుకబడిన, గిరిజన ప్రాంతాల్లో అక్షరాస్యత స్థాయి పెంచడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ మరియు పారామిలటరీ దళాల సిబ్బంది, హెవీ వాటర్ ప్లాంట్, ఎన్‌ఎమ్‌డీసీ, సింగరేణి బొగ్గు గనుల కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించే అవకాశం కల్పిస్తుంది. నామ కృషితో ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నవోదయ విద్యాలయం కూడా స్థాపించబడింది. ఇది స్థానిక విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. విద్యా రంగానికి మాత్రమే కాకుండా ఖమ్మం జిల్లాకు శాశ్వత అభివృద్ధి తీసుకురావడంలో నామ పాత్ర విశేషమైంది. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, ప్రజల సమస్యలపై లోతుగా ఆలోచించి, కేంద్ర స్థాయిలో ఫలితాలను సాధించే విజన్ ఉన్న నాయకుడుగా నామ నిలుస్తున్నారు అనుటలో సందేహం లేదు. నామ కృషి ఫలితంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం తో పాటు రాష్ట్రం లో మరో మూడు కేంద్రీయ విద్యాలయాల మంజూరుపై ప్రజలు, విద్యావంతులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .