మడికొండలో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు 

మడికొండలో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

కాజీపేట్,తెలంగాణ ముచ్చట్లు:
హనుమకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. మడికొండ గ్రామంలో వేణుగోపాల స్వామి గుడి నుండి పోచమ్మగుడి వరకు సుమారు 37.5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.


WhatsApp Image 2024-11-29 at 9.19.58 PM (1)ఈ సందర్భంగా ఎమ్మెల్యే  నాగరాజు మాట్లాడుతూప్రతి కాలనీ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, అంతర్గత రోడ్లు మరియు సైడ్ డ్రైన్ల నిర్మాణం నిరంతరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. కాలనీలలో ప్రజల నుంచి ఏవైనా సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆవాల రాధిక రెడ్డి, మెట్టుగుట్ట ఆలయ చైర్మన్ పైడిపాల రవిచందర్, మండల అధ్యక్షుడు సారంపల్లి శ్రీనివాసరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కుర్ల మోహన్, మహిళ మండల అధ్యక్షురాలు నీలం రజిని సహా పలువురు నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .