సత్తుపల్లిలో ఘనంగా ఫ్రెషర్స్ డే, పోషణ మాసం కార్యక్రమాలు.!

సత్తుపల్లిలో ఘనంగా ఫ్రెషర్స్ డే, పోషణ మాసం కార్యక్రమాలు.!

సత్తుపల్లి, సెప్టెంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి పట్టణంలో శనివారం ఉత్సవ వాతావరణం నెలకొంది. శ్రీ బండి శోభనచలం ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించబడ్డాయి. కొత్త విద్యార్థులకు ఉత్సాహం నింపుతూ యూనిఫామ్స్, నోట్‌బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ దంపతులు విద్యార్థులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఆశా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు, తల్లిదండ్రులు విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు.WhatsApp Image 2025-09-20 at 6.03.28 PMWhatsApp Image 2025-09-20 at 6.03.34 PM

అదేవిధంగా, కొత్తూరు గ్రామ రైతు వేదికలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న పోషణ మాసం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తొమ్మిది మంది గర్భిణీ మహిళలకు శ్రీమంతం వేడుక, ఇద్దరు చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించబడ్డాయి. ఎమ్మెల్యే రాగమయి ఆశీర్వచనాలు అందించి సంతోషాన్ని పంచారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పోషకాహార పదార్థాల ఉపయోగాలు, ఆరోగ్య సూచనలను కూడా వివరించారు.

ఈ కార్యక్రమాల్లో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్,  గాదె చెన్నారావు, కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సూపర్‌వైజర్లు, మాజీ కౌన్సిలర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొని వేడుకలను మరింత విశిష్టంగా తీర్చిదిద్దారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .