చెరువుల బలోపేతానికి  నిధుల మంజూరు

వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి

చెరువుల బలోపేతానికి  నిధుల మంజూరు

వనపర్తి తెలంగాణ ముచ్చట్లు: 

వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలంలోని పలు చెరువుల పటిష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల 43 లక్షల నిధులు మంజూరు చేసింది.పెద్దమందడి మండల కేంద్రంలోని పెద్ద చెరువు బలోపేతం  కోసం ఒక కోటి 12 లక్షలను, దొడగుంటపల్లి గ్రామ ఊర చెరువు పటిష్టత కోసం 76 లక్షలు
వెల్టూర్ చెరువు పటిష్టత కోసం 66 లక్షల50వేల రూపాయలను మంజూరు చేసినట్లు వనపర్తి ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.ఈ చెరువులను పటిష్ట  పరచడంతో ఆయా గ్రామాలకు సంబంధించిన  దాదాపు 1500 నుంచి 2000 ఎకరాలకు నిరాటంకంగా సాగునీరు అందించవచ్చునని ఆయన తెలిపారు.అన్నదాతల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని  ప్రజల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డికి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి,  ఎమ్మెల్యేప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .