కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ గ్రూప్-2 పరీక్ష. 

-మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన..

కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ గ్రూప్-2 పరీక్ష. 

-జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ జిల్లా ప్రతినిధి, తెలంగాణ ముచ్చట్లు:

 రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం ప్రారంభం అయ్యాయి. జిల్లా కేంద్రంలోని  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్   ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది గమనించి పలు సూచనలు చేశారు. కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ సాఫీగా పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఆదివారం ఉదయం సెషన్ లో జరిగిన  పరీక్షకు జిల్లాలో మొత్తం 5,855 మంది అభ్యర్థులకు గాను, 2,868 మంది హాజరు కాగా, 2,987 మంది గైర్హాజరు అయ్యారని 5,855.అభ్యర్థులకు గాను, మధ్యాహ్నం సెషన్ లో 2859 పరీక్ష రాయిగా, 2,996 మంది గైర్హాజరు అయ్యారని వివరించారు. ఆది, సోమవారాలలో ఉదయం, మధ్యాహ్నం చొప్పున మొత్తం నాలుగు సెషన్లలో  జరిగే గ్రూప్-2 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .