నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి

పాలకుర్తి,తెలంగాణ ముచ్చట్లు:

పాలకుర్తి పట్టణానికి చెందిన మారోజు సునీత-శంకరాచారి దంపతుల కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి. ఈ కుటుంబానికి చెందిన కుమార్తె అఖిల వివాహానికి రూ. 25,000 ఆర్థిక సాయం అందించారు.

కుటుంబం కడు పేదరికంలో ఉండి, శంకరాచారి పనికి అగయోగ్యుడవడంతో వివాహ ఏర్పాటుకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న ఝాన్సీ రెడ్డి, వారికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నిరుపేదల కుటుంబాలను సాయం చేయడంలోనే అసలైన ఆనందం ఉంది. నా నియోజకవర్గంలో ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా నన్ను సంప్రదించవచ్చు. సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను” అని పేర్కొన్నారు.

అంతేగాక, సామాజిక బాధ్యతతో మానవతావాదులు నిరుపేదలకు సహాయం చేయడానికి ముందుకు రావాలని ఝాన్సీ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు నాగన్న, మాజీ సర్పంచ్ యాకాంతరావు, పెనుగొండ రమేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .