ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం బ్యూరో,తెలంగాణ ముచ్చట్లు:
భవిష్యత్తులో ఎదురైయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆకాంక్షించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కలసిన పోలీసు, ప్రజలకు పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ యంత్రాంగం చేసిన సమిష్టి కృషి ఫలితమే నేటి సంతోషకరమైన వాతావరణం అని అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం జిల్లా పోలీసు యంత్రాంగం ఇదే స్పూర్తితో ముందుకు సాగలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్ , అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి,అడిషనల్ డీసీపీ విజయబాబు, ట్రైనీ ఐపిఎస్ రుత్వక్, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతి రెడ్డి, రహెమాన్, రఘు, శ్రీనివాసులు, రవి, సాంబరాజు, రవీందర్ రెడ్డి , నర్సయ్య, సుశీల్ సింగ్, అర్ఐలు, సిఐలు, ఎస్సైలు, పోలీస్ కమిషనర్ కార్యాలయ మినిస్ట్రీయల్ స్టాఫ్ పాల్గొన్నారు.


Comments