హెచ్.ఆర్.ఎస్ సత్తుపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గా పల్లిపాము డానియెల్ నియామకం.
సత్తుపల్లి, ఆగస్టు 19(తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి పట్టణానికి చెందిన పల్లిపాము డానియల్ ని బహుజన అభ్యుదయ సేవా సమితి అనుబంధ సంస్థ అయిన హ్యూమన్ రైట్స్ సొసైటీ సత్తుపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమించడం జరిగింది. ఈ సందర్బంగా బహుజన అభ్యుదయ సేవా సమితి అధ్యక్షురాలు, హ్యూమన్ రైట్స్ సొసైటీ కో ఫౌండర్ ఆదూరి మణి, సంస్థ వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం, డానియల్ ని నియమించారు.
ఈ సందర్బంగా డానియల్ మాట్లాడుతూ, నాపై నమ్మకంతో నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన సంస్థ నాయకులు ఆనందం, మణి లకు, జాతీయ అధ్యక్షులు, లీగల్ అడ్వైజర్ ఇనపనూరి మహేంద్రనాధ్, నేషనల్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కోట వెంకట్, రాష్ట్ర కమిటీ సభ్యులు చిల్లిముంత వెంకటేశ్వరరావు, కువ్వారపు విజయరావు, అయిలూరి శ్రీనివాసరెడ్డి, గోగుల వెంకటేశ్వరావు, కన్నెపోగు వెంకటేశ్వర్లు (కె వి ఆర్ )లకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో వివిధ వర్గాల ప్రజలకు నా వంతుగా మానవ హక్కులు - చట్టాలపై అవగాహన కల్పించుటకై కృషి చేస్తానని ఆయన అన్నారు.


Comments