జిసిసి కార్మికులసమస్యలు పరిష్కరించకుంటే సమ్మె ఉధృతం చేస్తాం

సిఐటియు నాయకులు బండారు శరత్ బాబు

జిసిసి కార్మికులసమస్యలు పరిష్కరించకుంటే సమ్మె ఉధృతం చేస్తాం

4వ రోజు సమ్మెను
 ప్రారంభించిన ప్రముఖ వ్యాపారవేత్త పల్లంటి దేశప్ప

భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు :

జిసిసి కార్మికులు సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని సిఐటియు పట్టణ నాయకులు బండారు శరత్ బాబు హెచ్చరించారు. నాలుగో రోజు సమ్మె శిబిరాన్ని ప్రముఖ వ్యాపారవేత్త లయన్ పల్లంటి దేశప్ప పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిఐటియు నాయకులు బండారు శరత్ బాబు మాట్లాడుతూ జిసిసి కార్మికుల ఎగుమతులు దిగుమతులు రేకులకు సంబంధించిన ఒప్పందాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు. భద్రాచలం ఏజెన్సీలో గిరిజన  సహకార సంస్థ ద్వారా సివిల్ సప్లై అందించు ధాన్యం అన్ని రేషన్ షాపులకు చేరవేసే కార్మికులకు చెల్లించాల్సిన ఎగుమతి దిగుమతి రేట్లు ఒప్పందం ప్రకారం ఇవ్వకుండా అధికారులు మేన మీసాలు లెక్కపెడుతున్నారని విమర్శించారు. తక్షణమే జిసిసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని, జీసీసి కార్మికుల సమ్మెకు మద్దతుగా అన్ని రంగాల కార్మికులను కూడగడతామని హెచ్చరించారు. ప్రముఖ వ్యాపారవేత్త పల్లంటి దేశప్ప సమ్మెను ప్రారంభించి కార్మికులకు సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గడ్డం స్వామి నకిరేకంటి నాగరాజులు పాల్గొనగా, జిసిసి కార్మికులు ప్రసాదు, శేషు, లోకేష్, రామారావు, ముత్తయ్య, పాండు, మోహన్, రవి, వీర్రాజు తదితరులు దీక్షలో కూర్చున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .